అతనికిద్దరు భార్యలు. వాళ్లిద్దరి మధ్య గొడవలు. ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదనుకున్నాడు. చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఆమె బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే, ఆస్పత్రిలోనే ఇంజక్షన్‌ చేశాడు. ఆపై వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లాలో.. 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, అనస్థీసియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో పెళ్లి అయింది. పిల్లలు కలగలేదు. దీంతో తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన(23)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు ముగ్గురు అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకు పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండో సారి గర్భం దాల్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published.