Hyderabad : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు (National Herald case)లో తెలంగాణ కాంగ్రెస్ నేతల (Telangana Congress leaders)కు ఈడీ (ED) నోటీసులు అందజేసింది. 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్‌ అలీ (Shabbeer Ali), సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy), అంజన్‌కుమార్‌ యాదవ్‌ (Anjan Kumar Yadav)… రేణుకాచౌదరి (Renuka Choudary), గీతారెడ్డి (Geetha Reddy) సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 10న ఢిల్లీ (Delhi)లో ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) తదితరులను ఈడీ విచారించింది. ఈడీకి సహాయం చేసిన నేతల్లో అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), గీతారెడ్డి (Geetha Reddy) పేర్లు ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.