రాజమండ్రి: కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) అనంతబాబు (Ananta babu) రిమాండ్‌‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు (Rajahmundry SC and ST Special Court) అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈరోజు కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చారు. కారు డ్రైవర్‌ హత్య కేసులో నేటితో రిమాండ్‌ గడువు ముగిసింది. మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అనంతబాబు రిమాండ్‌లో ఉన్నారు. హైకోర్టులో అనంతబాబు రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 26న విచారణ జరుగనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.