శ్రీకాకుళం: రాష్ట్రంలో జగన్ (CM Jagan) రివర్స్ పాలన చేస్తున్నారని కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి (Purandheswari ) విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రభుత్వాని (AP Government)కి పట్టడం లేదని మండిపడ్డారు. పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలుమరిచారని అన్నారు. మద్య నిషేధమని మహిళలను మోసం చేశారని ఆగ్రహించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదన్నారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అరాచకాలే అంటూ పురంధేశ్వరి (Former Union Minister) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published.