అనంతపురం: పోలీసుల తీరుపై మాజీమంత్రి పరిటాల సునీత(Paritala sunitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా జైలులో ఐటీడీపీ ఉపాధ్యక్షుడు కట్టా లోకేష్‌ను సునీత (Former minister) పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ శ్రేణుల (TDP)ను కొట్టడానికి పోలీసులకు చేతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మెప్పు కోసం సీఐ విజయభాస్కర్ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీఐ పద్ధతి మార్చుకోకపోతే ఆందోళనకు దిగుతామని పరిటాల సునీత హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.