ఉరవకొండ: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆయ‌న‌కు అపూర్వ ఆదరణ లభిస్తోంది. శనివారం బెలుగుప్పలో గడప గడపకు కార్యక్రమం వేడుకగా సాగింది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, ప్రజలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విశ్వేశ్వరరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డితో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలు పేర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.