ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కాగా..ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమకు డబ్బులు అందడం లేదని పలు చోట్ల మహిళలు ధర్నాలు చేయడం విశేషం.శనివారం జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముఖచిత్రమిది. ప్రచార గడువు ముగియడంతో గురువారం ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు లోలోపల మంత్రాంగాల్ని నడిపించారు. ఇక శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండటంతో రహస్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఓటుకింత అనేలా నగదు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. మద్యం, బిర్యాణీ ప్యాకెట్లను పంపిణీని చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.