ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించే విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 1955 నాటి ఆంధ్రప్రదేశ్‌ సినిమాల నియంత్రణ చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్‌ జారీ చేయనుంది. టికెట్ల విక్రయానికి ఏపీఎఫ్‌డీసీ ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రేక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఆన్‌లైన్‌తోపాటు ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే విధానం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. థియేటర్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు నివారించేందుకు, ప్రేక్షకులకు సమయం ఆదా చేసేందుకు, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు

By admin

Leave a Reply

Your email address will not be published.