విశాఖపట్నం: సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకున్న వ్యక్తి జగన్ (CM Jagan) అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ (AP CM) అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని.. రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజలను నమ్మించి జగన్ (YS Jagan mohan reddy) అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు కావాలని జగన్ (YCP Chief) లక్ష్యమన్నారు. జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేయడం వలన రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని ఆయన తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.