అడ్డు అదుపు లేకుండా పెంచుకుపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు రద్దు చేయాలంటూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు గురువారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని నినదించారు.
కలెక్టరేట్‌ : జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్‌ మీదగా గురజాడ అప్పారావు విగ్రహం వరకు సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాల ఆధ్వర్యాన ద్విచక్ర వాహనాలతో నడుచుకుంటూ వినూత్నమైన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఐ (ఎంఎల్‌) జిల్లా నాయకుడు వై.కొండయ్య తదితరులు మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటికి లీటరు పెట్రోల్‌ రూ.65, డీజిల్‌ రూ.45, వంటగ్యాస్‌ బండ రూ.450 ఉండేదని తెలిపారు. గడిచిన 7 ఏళ్ల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెంచుకుంటూ వంటగ్యాస్‌ రూ.1000, పెట్రోల్‌ రూ.115, డీజిల్‌ రూ.105కు పెంచుకుపోయారని విమర్శించారు. ఇది ప్రజలుపై పెనుభారంగా ఉందని, వెంటనే పెంచిన ధరలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, పి.మణి, ఎం.సుబ్బారావు, కుమార మంగళం, వి.కృష్ణారావు, ఆర్‌పి రాజు, గండి నాయన బాబు, సిపిఐ నాయకులు ఎస్‌.కె రెహమాన్‌, ఎం.మన్మధరావు, జి.కాసులరెడ్డి, కాసుబాబు, వి.కన్నబాబు, కె.లక్ష్మణరావు, ఎ.రవి, కె.సుబ్బరాజు, ఎ.ఆదినారాయణ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.