‘‘ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలంతా మునుగోడులోనే మకాం వేయండి. నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టండి. ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవండి. అందరినీ పోలింగ్‌ బూత్‌కు తీసుకొచ్చి పువ్వు గుర్తుకు ఓటేయించండి ఉప ఎన్నిక ఫలితం తర్వా త టీఆర్‌ఎస్‌ కనుమరుగు కాబోతోంది. మునుగోడులో బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికపై చర్చ జరుగుతోంది. ఓటుకు రూ.30 వేలు పంచి గెలవాలని కేసీఆర్‌ చూస్తున్నారు. బీజేపీ దమ్ము ఏంటో చూపించే అవకాశం ఈ ఎన్నిక ద్వారా మనకు మరోసారి వచ్చింది. మీరంతా కష్టపడి పని చేయండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం రాత్రి బండి సంజయ్‌ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.