న్యూఢిల్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందడపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రజలు విశేషాభిమానాన్ని చూరగొనిన ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్‌కుమార్ అని, అలాంటి పునీత్‌ను విధి మన నుంచి దూరం చేయడం బాధాకరమని ఓ ట్వీట్‌లో సంతాపం తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయన కాలం చేసినప్పటికీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోతుందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ప్రధాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పునీత్ తనతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.