హైదరాబాద్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు పునీత్ ఆకస్మిక మరణంపై టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేస్తున్నారు. దీంతో మిస్ యూ అప్పూ ట్రెండింగ్‌లో ఉంది.
బెంగళూరులో విక్రమ్ ఆసుపత్రి వెలుపల వందలాదిగా అభిమానులు హృదయవిదారకంగా రోదించిన దృశ్యాలు ఆయన గొప్పదనానికి అద్దం పట్టాయి. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక్కసారిగా బారికేడ్‌ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారంటే వారి అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజం కాకుండా ఉంటే బావుండు అంటూ కంట తడి పెడుతున్నారు
ఈ సందర్భంగా అభిమానులపై పునీత్ పంచిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. ఆయనొక జెమ్…ఆయన లేని లోటు తీరదంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఔదార్యానికి, సేవాతత్పరతకు సంబంధించిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అక్టోబర్ 29 శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.