ముంబై: ఎట్టకేలకు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. గురువారం ఆర్యన్‌ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్‌ మంజురూ చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్‌ హాజరుకావాల్సి ఉంటుంది. దేశం వదిలి వెళ్లకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా ఈ నెల అక్టోబర్‌ 2వ తేదీన క్రూయిజ్‌ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు గురువారం బెయిల్‌ రావడంతో షారుక్‌ కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.