అమ‌రావ‌తి: జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి గుడ్లు సరఫరా చేసేవారు. దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది.

కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కోడిగుడ్లపై స్టాంపింగ్
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.