రాయపూర్: జనం, మీడియా చూస్తుండగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) కొరడా దెబ్బలు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దుర్గ్ జిల్లాలోని గౌరి-గౌర (Gauri Gaura) పూజలో పాల్గొన్న సీఎం, అక్కడి గిరిజన సంప్రదాయం ప్రకారం కొరడాతో కొట్టించుకున్నారు. దీపావళి మరుసటి రోజు ఈ పూజ నిర్వహిస్తుంటారు. చెడును తరిమి కొట్టేందుకు కొరడా దెబ్బలు కొట్టడం ఈ పండుగ సంప్రదాయం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, విఘ్నాలు తొలగడం కోసం భూపేష్ ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన చేయి చాపుతూ మణికట్టుపై కొరడా దెబ్బలు కొట్టాలని కోరారు. జనం సమక్షంలో సీఎం కొరడా దెబ్బలు తిన్నారు. సంప్రదాయానుసారం కొరడా దెబ్బలు కొట్టిన వ్యక్తి ఆ తర్వాత సీఎంకు అభివాదం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.