సంగారెడ్డి: విద్యార్థినికి పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటన జిల్లాలోని కరుణ పాఠశాలలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి(14)ని నిక్సన్ అనే ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేశాడు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తనపట్ల నిక్సన్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా కేసు విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

By admin

Leave a Reply

Your email address will not be published.