తిరుమల: సూర్యాగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు. ఉ.8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ కూడా మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సూర్యాగ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేశారు. పుణ్యహవచనం, ఆలయ శుద్ధి అనంతరం.. రాత్రి 9 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనం మొదలవుతుంది.
ఇక..తిరుమల శ్రీవారిని సోమవారం శ్రీవారిని 69,278 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 17,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.