Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మృతితో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సినీ నటులే కాదు.. దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ రాజ్ కుమార్ మరణించారు అంటే తాము నమ్మలేకపోతున్నామంటున్నారు. పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ యాక్టర్ సుమన్ పునీత్ రాజ్ కుమార్ మృతి పై స్పందించారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన పునీత్ ని మరణ వార్త విన్న తాను మొదట నమ్మలేదన్నారు. పునీత్ మరణం నిజమేనా అంటూ బెంగళూరులో ఉన్న తన స్నేహితులను అడిగి తెలుసుకున్నానని… చెప్పారు సుమన్. పునీత్ మరణం నిజంగా చాలా దురదృష్టమని . ఏది ఏమైనా కన్నడ పరిశ్రమకు తీవ్ర నష్టమని అన్నారు. ఆయన ఫ్యామిలీకి సంతాపం తెలిపారు సుమన్.