వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎంగా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2022లో మరోసారి యోగి ఆదిత్యనాథే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. అలాగే 2024లో మోడీనే మూడోసారి ప్రధాని కానున్నారని ప్రకటించారు. యూపీలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు 2022లో పునాది పడాలని అమిత్ షా అన్నారు. దీపావళి తర్వాత ఎన్నికల హీట్ పుంజుకోనుందని.. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం పని చేయాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్లలో గెలుపే టార్గెట్‌గా పనిచేయాలని సూచించారు.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు లక్నోలో మేరా పరివార్-బీజేపీ పరివార్ అనే బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ విదేశాల్లో ఉన్నారని.. ఇక్కడి వాయిస్ అక్కడికి చేరాలని అమిత్ షా అన్నారు. బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించడానికి ఈరోజు నేను ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక భూమికి వచ్చానని ఆయన అన్నారు. దీంతో పాటు దీపావళి రోజున ప్రతి ఇంటిలో ‘నా కుటుంబం-బీజేపీ కుటుంబం’ అంటూ ఆమోదం తెలపాలని ప్రచారం కూడా మొదలవుతోంది. ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ గుర్తింపు తెచ్చేందుకు బీజేపీ కృషి చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.