మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు. హుజురాబాద్‌ ప్రజలు తమ తీర్పు చెప్పే టైం వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు.

మహిళలు లక్షా 19 వేల 102మంది కాగా పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో శుక్రవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నేతల వాహనాలను తనీఖి చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని పెట్టారు.

By admin

Leave a Reply

Your email address will not be published.