:ప్రపంచ స్ట్రోక్‌ డేని పురస్కరించుకొని శుక్రవారం మెడికవర్‌ హాస్పిటల్స్‌ బీచ్‌ రోడులో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. మెడికవర్‌ సిబ్బంది, బీచ్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు, విద్యార్థులు, వృద్దులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటెర్వెన్షనల్‌ న్యూరో వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ శిభసంకర్‌ దలై హృద్రోగ నిపుణులు డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌ బెహెరా, డాక్టర్‌ కరుణాకర్‌ పాడి, సీనియర్‌ నరాల వైద్య నిపుణులు డాక్టర్‌ సత్యారావు, డాక్టర్‌ మోహన్‌ సుమేధ, న్యూరో రేడియోలోజిస్ట్‌ డాక్టర్‌ అనిల్‌ దేవర, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ వినరు భూషణ్‌ , డాక్టర్‌ సోదన్‌ స్ట్రోక్‌పై ప్రజలకు చైతన్యం కలుగ చేసారు. మెదడులోని ఓ భాగానికి రక్తప్రసరణకు అవరోధం ఏర్పడినా, ఆగిపోయినా లేదా తగ్గి పోయినా బ్రెయిన్‌ టిష్యూకు సరిపడా ఆక్సిజన్‌, పోషకాలు అందవు. దీనిని స్ట్రోక్‌ గా పిలుస్తా రన్నారు. అధిక బరువు, హై కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌,హై బ్లడ్‌ ప్రెజర్‌, పొగ తాగడం, మద్యపానం వంటి కొన్ని కారణాలతో న స్ట్రోక్‌ రావచ్చని తెలిపారు. 55 సంత్సరాలు పైబడిన వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే స్ట్రోక్‌ ను తప్పించు కోవచన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.