:గోవాడ సుగర్స్ రైతులకు పూర్తిస్థాయిలో పేమెంట్లు ఇస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. అమరావతి నుండి ఫోన్లో మాట్లాడుతూ, గడిచిన సీజన్‌కు మూడు లక్షల 67 వేల టన్నులు చెరుకు క్రషింగ్ జరిగిందన్నారు. ఇప్పటివరకు మూడు లక్షల 53 వేల టన్నులకు టన్నుకు రూ.2,500 చొప్పున పేమెంటు జరిగిందన్నారు మిగతా 14 వేల టన్నులకు శనివారం నుండి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని తెలిపారు. దీపావళి ముందు రైతులకు బకాయిలు లేకుండా చేస్తానని హామీ నెరవేరిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆప్కాబ్ ద్వారా రుణాన్ని మంజూరు చేయించి రైతులకు పేమెంట్లు చేశామన్నారు. పంచదార అమ్మకం ద్వారా రూ.24కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే కార్మికులకు ఇవ్వవలసిన జీతభత్యాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలను ఇవ్వడం జరుగుతుందన్నారు