కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం గుండాల వీధి జంక్షన్లో సిపిఎం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాలకృష్ణ, గంటా శ్రీరామ్, కొణతాల సంతోష్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి ధరలు ప్రజలు మోయలేనంతగా పెరుగుతూనే ఉన్నాయన్నారు. దీంతో సామాన్య, పేద ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. నిరుద్యోగం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మి, మంగ, లక్ష్మి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.