విశాఖపట్నం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు నూరు శాతం స్కూల్‌ ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున్‌ను కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టర్‌ మల్లిఖార్జున్‌ను శ్రీనుబాబు కలసి గత ఐదేళ్లుగా ఫీజు రాయితీలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల కాఫీలను కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు ఆయా కాఫీలను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌ అక్రిడేషన్లు వేగవంతంగా జారీ చేస్తే హెల్త్‌ ఇన్యూరెన్స్‌, బస్‌ పాసు, రైల్వే పాసులకు దోహద పడుతుందన్నారు.కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని శ్రీనుబాబు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.