లీటర్కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది.