స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదా? కేంద్రానిదా అన్న విషయం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తెలుసా అని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్‌ ప్రశ్నించారు. వైసిపి నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అమర్‌నాధ్‌ మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాటానికి వైసిపి పూర్తి మద్దత్తు ఇస్తుందన్నారు. 9 నెలలుగా ఈ పోరాటంలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్రంపై కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేయడమే అతని తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాని గడువు ఇవ్వడం ఏమిటని అన్నారు. అసలు సమస్యపై ఆయనకు అవగాహన లేదన్నారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను సమర్థిస్తూ మాట్లాడారని, ఇప్పడు ప్రజలపక్షాన ఉద్యమిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.