పర్యావరణ అటవీ హక్కుల చట్టం 1980కి సవరణలు చేస్తే గిరిజన హక్కులకు తూట్లు పొడిచినట్లేనని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ అన్నారు. పార్టీ ఆరో మండల మహాసభ స్థానిక నాగదేవత కల్యాణ మండపంలో ముర్ల చంటిబాబు, పాంగి బాలయ్య అధ్యక్షతన జరిగింది. గత కార్యక్రమాల నివేదికను మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సభలో చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగి ప్రజల ఆదాయాలు దిగజారిపోయాయన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.