ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లాలో పర్యటించారు. అక్కడి స్వర్ణభారత్ ట్రస్ట్ లో యువతతో ముఖాముఖీ నిర్వహించారు. కులం- మతం- వర్గం- జిల్లా పేర్లతో జనాల్ని చీల్చేవారిని దూరం పెట్టాలని వ్యాఖ్యానించారు వెంకయ్య. అందుకే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అని తానెపుడూ చెబుతుంటాననీ… మనం చట్ట సభలకు ఎన్నుకునే నాయకుల- కేరెక్టర్ మాత్రమే కాదు- కేలిబర్ ముఖ్యం- అంతకన్నా మించి కండక్ట్ ఇంపార్టెంట్ అని పేర్కొన్నారు. సరైన నడవడిక లేని నాయకులతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని… ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల వాళ్లూ.. ఒకలాగానే ఉన్నారని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.