నెల్లూరు: ప్రధాని మోదీ (PM Narendra Modi) నిర్వహించే జీ 20 సదస్సు ఎందుకు? పేదవాళ్ల ఆకలి తీర్చడానికా, కన్నీళ్లు తుడవడానికా? అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Chintamohan) ప్రశ్నించారు. చేతనైతే నిరుద్యోగ సమస్య తీర్చాలన్నారు. జీఎస్టీ, పెరుగుతున్న ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ (BJP) ఎనిమిదన్నరేళ్లో ఏం చేసిందని నిలదీశారు. మూడున్నర ఏళ్లలో వైసీపీ (YCP) ఏం చేసింది? దమ్ముంటే డిబేట్కు రావాలని సవాల్ విసారు. జీ 20 సదస్సుకు పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకుంటూ వెళ్లబోతున్నారని చింతామోహన్ (Former union miniter) ఆగ్రహం వ్యక్తం చేశారు.