విజయవాడ: ఈనెల 27న ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర ప్రధమ మహాజన సభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అదే రోజున సంక్షేమ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మహా సభకు 26 జిల్లాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా తరలిరావాలని పిలుపిచ్చారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. మహా జన సభకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్ , బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడిని ఆహ్వానించామని తెలిపారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *