హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏసీబీ కోర్టు ఇప్పటికే వాళ్ల బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల బెయిల్ పిటిషన్ను పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు నిందితులు బెయిల్ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది.