Assam: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అయింది. అయితే ఆడవారు అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అర్ధరాత్రి తిరగడం మాట అటు ఉంచి పగలు కూడా దైర్యంగా తిరగలేని పరిస్థితులున్నాయి. ఇక కట్టుకునే బట్టలను ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకు లేదనే విషయం మరోసారి ఈ విషయం రుజువు చేస్తుంది. జీన్స్ ధరించి తన షాపులోకి వచ్చిన అమ్మాయిని అవమానించి అసభ్యంగా ప్రవర్తించి తన షాపునుంచి గెంటేశాడు.. ఈ దారుణ ఘటన అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బిస్వనాథ్ జిల్లాలోని చారియాలిలోని మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ అమ్మే దుకాణంలోకి ఓ బాలిక ఇయర్‌ఫోన్స్ కొనేందుకు వెళ్ళింది. అయితే ఆ బాలికను షాప్ యజమాని నూరుల్ అమీన్ అసభ్య పదజాలంతో దూషించాడు. బురఖాకు బదులుగా జీన్స్ ధరించినందుకు అమ్మాయిని అవమానపరిచాడు. అంతేకాదు నేను నీకు నా షాపులోని వస్తువులను అమ్మను అంటూ ఆ బాలికను అవమానిస్తూ.. షాప్ నుంచి బలవంతంగా బయటకు గెంటేశాడు.