హైదరాబాద్ సిటీ: వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు వాటిని అలాగే కొనసాగించే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల స్వల్ప మార్పులు చేసినప్పటికీ, నిబంధనలను మరోసారి వెల్లడించారు. వారం రోజులుగా పోలీసులు తీసుకున్న నిర్ణయంతో కొంతమంది వాహనదారుల్లో ఉత్సాహం రెట్టింపు కాగా, కొందరిలో మాత్రం నిరుత్సాహం కనిపిస్తోంది. చాలాచోట్ల దూరం పెరిగిందని కొందరి వాదన.