అమరావతి: చింతామణి నాటకం (Chintamani natakam)పై ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnam raju) వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చింతామణి నాటకాన్ని నిషేధించడం సరికాదని… చింతామణి సందేశాత్మక నాటకమని న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. నాటకం నిషేధంతో ఎంతోమంది కళాకారుల ఉపాధి దెబ్బతింటోందని తెలిపారు. వ్యభిచార నిరోధానికి ఈ నాటక ప్రదర్శన ఎంతో అవసరమన్నారు. ఒక కులం మనోభావాలు దెబ్బతిన్నాయని నిషేధిస్తూపోతే ఇతర కులాలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.