అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Birthday Greetings) తెలిపారు. ‘‘విశాల భారతావనిని పరిపాలిస్తున్న జాతీయ రాజకీయ పక్షానికి మీరు నేతృత్వం వహిస్తున్నారంటే మీ శక్తియుక్తులు, రాజకీయ పటిమ, దీక్షాదక్షతలు ఎంతటివో అవగతమవుతుంది.. మూడు పదుల ప్రాయంలోనే చట్టసభకు ఎన్నిక కావడం మీలోని రాజకీయ జిజ్ఞాసకు నిదర్శనం.. న్యాయవాదిగా, మంత్రిగా, రాజకీయవేత్తగా మీరు సాధించిన విజయాలు నేటి తరానికి ఆదర్శప్రాయం.. మీ కీర్తి ప్రతిష్టలు అజరామరంగా వెలుగొందాలని, మీకు సుసంపన్నమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.