విశాఖపట్నం: ‘విపకక్షాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికే అంటగడుతున్నాయి. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ విషం చిమ్ముతోంది” అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి , మంత్రులపైన విపక్షాలు ఆధారులు లేని ఆరోపణలు చేస్తున్నాయని అమర్నాథ్‌ మండిపడ్డారు.

ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ”ప్రతిపక్షం నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. కానీ సంబంధం లేని అంశాల్లో అసత్య ఆరోపణలు చేయడం తగదు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తోన్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాము” అని డిమాండ్‌ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.