ప్రణాళికాబద్ధంగా గంజాయి సాగు, రవాణాను అరికడతామని డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. గంజాయి స్మగ్లర్లు, వారికి సహకరించే వారి వివరాలను అన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నామన్నారు. గంజాయి ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయం చేసుకొనేందుకు కో ఆర్డినేషన్‌ బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. గంజాయి నియంత్రణ కోసం సోమవారం నగరంలోని ఓ ప్రయివేట్‌ హోటల్‌లో ఇంటర్‌స్టేట్‌ కో ఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌కు రాష్ట్రానికి సంబంధంలేదన్నారు. గంజాయి రవాణాలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన వారి పాత్ర ఉండవచ్చని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రెండ్రోజుల్లో 150 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2017లో మూడు వేల ఎకరాల్లో ధ్వంసం చేసిన తరువాత మళ్లీ గంజాయి వంట ధ్వంసం చేయడం ఇదేనన్నారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగంపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.