జిల్లాలోని వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నిస్తామన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సం వేడుకలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సి కార్పొరేషన్ ద్వారా 4014 మంది లబ్ధిదారులకు రూ.4.41 కోట్లతో ఆర్థిక, శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నాడు-నేడు కింద మొదటి దశలో రూ.315 కోట్లతో 1130 పాఠశాలలను ఆధునీకరించినట్లు తెలిపారు. మరో 699 పాఠశాలల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం-చెన్నై ఇండిస్టియల్ కారిడార్(విసిఐసి) కింద రూ.348 కోట్లతో 13.78 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు