Self Help Groups: మోడీ సర్కార్ మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని మోడీ సర్కార్ భావిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి ఏడాది రూ.లక్ష సంపాదించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందు కోసం ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.