భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీ దుర్గాంబికా భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం సంఘం అధ్యక్షులు ఎస్.రాంబాబు అధ్యక్షతన స్థానిక తుపాను బిల్డింగ్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా దేముడు నాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, గణేష్, అప్పలనాయుడు, కాశీ రమణ, అప్పారావు, కోదండరావు, సిహెచ్.గంగరాజు పాల్గొన్నారు.