Andhra Pradesh CM Jagan: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉపఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి డా. సుధమ్మ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై భారీ ఓట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బద్వేల్ ఉపఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతీ ఆత్మీయ సోదరునికి పేరుపేరునా జగన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. శాసన సభలో అడుగు పెట్టనున్న డా. సుధమ్మకు ముఖ్యమంత్రి అభినందనలు చెప్పారు.