Kilo Class Submarine Data Leak: కిలో క్లాస్ సబ్-మెరైన్ డేటా లీక్ నేవీలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు అధికారులు. తాజాగా ఈ ఇష్యూలో మరో ఆరుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. దీంతో నేవీలో కలకలం రేపుతోంది సబ్-మెరైన్ డేటా లీక్ వ్యవహారం.
భారత నావికాదళంలోని జలాంతర్గాములకు సంబంధించిన కీలక రహస్యాల లీక్ కేసులో ఆరుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. సర్వీసులో ఉన్న ఇద్దరు కమాండర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. నావికా దళానికి చెందిన కిలో క్లాస్ జలాంతర్గములకు చెందిన సమాచారం బయట వ్యక్తులకు అందజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సబ్మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్ ప్రోగ్రాం వివరాలను లీక్ చేసినట్లు వెల్లడించింది సీబీఐ. సర్వీసులో ఉన్న అధికారులు కీలక సమాచారాన్ని విశ్రాంత అధికారులకు అందజేశారు. ఆ విశ్రాంత అధికారులు దక్షిణ కొరియా కంపెనీ కోసం పనిచేస్తున్నారని అభియోగాలున్నాయి.