మైసూరు: కర్ణాటకలో ఇటీవల కాలంలో ఆత్మహత్యా ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయి, పేదరికంతో బతుకు బండి నెట్టుకురాలేక, వ్యాపారం దెబ్బతిని, మానసికంగా నలిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. గత శనివారంనాడు మైసూరుకు చెందిన 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం 20 ఏళ్ల ప్రాయంలోని ఇద్దరు సోదరులు మైసూరులోని హెచ్‌డీ కోతె తూలూకా కట్టెమనుగనహళ్లిలో ఆత్మహత్మకు పాల్పడ్డారు. నిరుద్యోగం కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన కారణంగానే ఈ సోదరులు తనువు చాలించాలనే దారుణ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హెచ్.మూకహళ్లిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉసురు తీసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలే అయినా ఈ తరహా కేసులు రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజూ నమోదు అవుతున్నాయి.

కర్ణాటక ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో గట్టి చర్యలే తీసుకున్నప్పటికీ, చేసేందుకు పనిలేక, ఉన్న ఉద్యోగం కోల్పోయి, వ్యాపారంలో నష్టాలు చవిచూసి, ఆర్థిక ఇబ్బందులు తాళలేక, పేదరికంలోకి నెట్టబడి, తనువు చాలించాలనే నిర్ణయం తీసుకుంటున్న వారికి మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోకపోతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.