జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశాను విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు, నియోజకవర్గ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కొండవాలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కెకె రాజు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కటుమూరి సతీష్‌, బాణాల శ్రీనివాసరావు, కంపా హనుక్‌, అల్లు శంకరరావు, వావిలపల్లి ప్రసాద్‌, కెవిఎన్‌ శశికళ, కె.అనీల్‌ కుమార్‌ రాజు, సాడి పద్మరెడ్డి, సారిపిల్లి గోవింద్‌, ఆళ్ళ లీలావతి శ్రీనివాస్‌, పి.ఉషశ్రీ, కంటిపాము కామేశ్వరి, రెయ్యి వెంకటరమణ, చల్లా రజని, ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.