ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైసిపి సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యాన కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జిలు, నాయకులతో పలు అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా సమస్యలు, పరిష్కార మార్గాల గురించి చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా చేరే విధంగా చూడాలని కెకె.రాజు సూచించారు. ఓటర్ నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినందున ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు అల్లు శంకర్రావు, కంపా హనోక్ పాల్గొన్నారు.