భారత ఉపరాష్ట్రపతి 5 రోజుల పర్యటనకు విశాఖ వచ్చిన సందర్భంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ 100 శాతం అమ్మకంపై స్పందించాలని, తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విశాఖలో చదువుకొని, ఇక్కడ నుండే రాజకీయాల్లో ఎదిగిన వెంకయ్య విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కొరకు జరిగిన ఉద్యమంలో పాల్గొన్నట్లు పలుసార్లు ప్రకటించారని గుర్తు చేశారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం అమ్మేస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో వెంకయ్య మౌనంగా ఉండటం సరైంది కాదని, ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రహాని అని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా 265 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుందని, ప్రైవేటీకరణ చేయొద్దని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయినా మోడీ ప్రభుత్వం మొండిగా ప్లాంట్‌ అమ్మకానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.