ముంబై : డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడికి బెయిల్‌ను తిరస్కరించారు. క్రూయిజ్ షిప్ పార్టీ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఇవాళ నార్కోటిక్స్ ఏజెన్సీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం వరకు ఆర్యన్ వారి కస్టడీలో ఉండనున్నారు. ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఆర్యన్‌కు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ సేత్ మెర్చంట్, మున్మున్ ధమెచాలను ఎన్సీబీ అక్టోబర్ ఏడవ తేదీ వరకు తమ కస్టడీలో ఉంచనున్నది.