వేంపాడు టోల్‌ ప్లాజాలో పని చేస్తున్న కార్మికులకు 20 శాతం బోనస్‌ చెల్లించాలని, కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేంపాడు టోల్‌ ప్లాజా వద్ద కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు.గత సంవత్సరం దీపావళి సందర్బంగా టోల్‌ గేట్‌ మేనేజ్మెంట్‌ 9 వేలు బోనస్‌ చెల్లించిందని, ఈ సంవత్సరం ఊ.7 వేలు మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బోనస్‌ తగ్గించడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని, 20 శాతం బోనస్‌ చెల్లించాలని, ఇస్తున్న వేతనంపై 30 శాతం ఇంక్రిర్మెంట్‌, గ్రాడ్యుటి చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, మండల నాయకులు ఎం.రాజేష్‌, యూనియన్‌ నాయకులు మేక సూరిబాబు, రాజశేఖర్‌, సత్యనారాయణ, శ్రీను, సత్తిబాబు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.