అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ బ్యూటీ అమ్ము అభిరామి.. రాక్షసుడు.. నారప్ప.. Fcuk వంటి చిత్రాల్లో హీరోయిన్‏గా కనిపించి ఫుల్ క్రేజ్ అందుకుంది. ఇక జగపతి బాబు నటించిన Fcuk సినిమా.. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలు అమ్ము అభిరామికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నారప్ప మూవీలో వెండీ కోడలు.. ప్రేమికురాలిగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

నా థార్ వచ్చేసింది.. మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను.. 2012లో నేను ఏడవ తరగతిలో ఉన్నాను.. ఓ రోజు నేను మా నాన్న విరుగంబాక్కం సిగ్నల్ వద్ద ఆగాం.. అక్కడ మొదటిసారి థార్ కారును చూసి ప్రేమలో పడిపోయాను. అదే నా మొదటి క్రష్.. ఫస్ట్ లవ్.. నా మనసంతా దాంతో వెళ్లిపోయింది. ఇంతలా ఏ కారు కూడా నన్ను ఆకర్షించేలేదు..అప్పటివరకు కార్లను ఇష్టపడని నేను ఈ కారుతో ప్రేమలో పడిపోయా. ఎవడు వీడు.. డాడీ ఇంత అందంగా ఉన్నాడు అని మా నాన్నను అడిగాను. మా నాన్న షాకయ్యాడు.. ఈ వయసులో ఎవడి గురించి అడుగుతుంది అని.. కానీ ఆ తర్వాత అర్దమైంది నేను కారు గురించి అడుగుతున్నాను అన.. ఆ కార్ మహీంద్రా థార్.. సూపర్ బండి అని బదులిచ్చాడు..

By admin

Leave a Reply

Your email address will not be published.